ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబురం

54చూసినవారు
ఘనంగా తెలంగాణ ఆవిర్భావ సంబురం
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం రాత్రి హైదరాబాద్‌ ట్యాంక్‌బండ్‌పై అంబరాన్నంటేలా సంబురాలు నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్యఅతిథిగా రాష్ట్ర గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రాష్ట్రమంత్రులు, సీఎస్‌ శాంతి కుమారి తదితరులు హాజరయ్యారు. రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తరలివచ్చిన కళాకారులు.. తెలంగాణ చరిత్ర, సంస్కృతిని చాటిచెప్పేలా 17 కళలను ప్రదర్శించారు.