Top 10 viral news 🔥
ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లిని హత్య చేసిన కొడుకు
ఢిల్లీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నగరానికి చెందిన సావన్(22) అనే యువకుడు ఒక యువతిని ప్రేమించాడు. ఇదే విషయం ఇంట్లో చెప్పగా.. తన తల్లి సులోచన నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురైన సావన్ పథకం ప్రకారం తల్లిని హత్య చేశాడు. దోపిడి సమయంలో హత్య జరిగినట్లు పోలీసులకు ఫోన్ చేసి తెలిపాడు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు తమదైన స్టైల్లో విచారించగా.. తానే హత్య చేసినట్లు సావన్ ఒప్పుకున్నాడు.