పిల్లలు స్కూలు రాకపోతే ఫోన్‌కు మెసేజ్ వచ్చేలా ఏర్పాటు చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. బాపట్లలో శనివారం నిర్వహించిన మెగా పేరెంట్-టీచర్ మీటింగ్‌లో ఆయన పాల్గొని మాట్లాడారు. 'ఇకపై పిల్లల అటెండెన్స్, పరీక్షా ఫలితాలు, ఆరోగ్య విషయాలు కూడా తల్లిదండ్రుల ఫోన్‌కు మెసేజ్‌లు వస్తాయి. ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడాలని నా ఆలోచన. అందుకోసం పిల్లల్లో అవగాహన పెంచుతాం, వారిని డాక్టర్లకు చూపించి ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెబుతాం.' అని సీఎం అన్నారు.