నెదర్లాండ్స్ రాజధాని ది హేగ్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పలు అపార్ట్‌మెంట్‌లు ధ్వంసమయ్యాయి. ఇంకా పలువురికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో చాలా మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. కాగా, పేలుడుకు గల కారణాలు తెలియాల్సి ఉంది.