
అందుకే ఆప్ ఓడిపోయింది: ధ్రువ్ రాఠీ
దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపై ప్రముఖ యూట్యూబర్ ధ్రువ్ రాఠీ స్పందించాడు. కొన్నేళ్లుగా ఢిల్లీలో ఎలాంటి పనులు జరగకపోవడంతోనే ఆప్ ఓడిపోయిందని అభిప్రాయపడ్డాడు. ప్రభుత్వం పనిచేయకుండా బీజేపీ అన్ని విధాలుగా ప్రయత్నించిందని, ఏజెన్సీల ద్వారా తప్పుడు కేసులు పెట్టి నాయకులను జైలులో పెట్టించిందని ఆరోపించాడు. అభివృద్ధి మానేసి మత విద్వేషం పేరుతో ప్రజల బ్రెయిన్ వాష్ చేయడంలో బీజేపీ ఇక్కడా విజయం సాధిస్తుందా? అని ప్రశ్నించాడు.