కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈడుపుగల్లు గ్రామంలోని ఓ పాఠశాలలో పనిచేసే టీచర్ మండవ వెంకట శ్రీనివాస్ విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని బాధిత విద్యార్థినులు తల్లిదండ్రులకు తెలిపారు. దాంతో వారు కంకిపాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.