కోల్ కతాలో ట్రైనీ డాక్టర్ హత్య నేపథ్యంలో.. ఈసారి గణేష్ ఉత్సవాలను సాధారణంగా నిర్వహించాలని అక్కడి కమిటీలు నిర్ణయించాయి. ‘అత్యాచారంపై పోరాటం’ అనే థీమ్ తో ఈసారి మండపాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఓ కమిటీ వెల్లడించింది. చందర్‌నగర్‌లోని శాటిలైట్ టౌన్షిప్ సాల్ట్ లేక్‌లో ఏర్పాటు చేసిన లైట్ షోను రద్దు చేస్తున్నట్లు కమిటీ తెలిపింది. ప్రతి సంవత్సరం ఇక్కడ జరిగే ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారు.