అల్లు అర్జున్ విడుదల మరింత ఆలస్యం.. ఇవాళ జైల్లోనే!
సంధ్య థియేటర్ ఘటన కేసులో అరెస్టైన నటుడు అల్లు అర్జున్ విడుదల మరింత ఆలస్యమయ్యే అవకాశాలున్నాయని, ఇవాళ ఆయన రిలీజ్ కాకపోవచ్చని జైలు అధికారులు చెబుతున్నారు. హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వుల కాపీ ఇంకా జైలుకు చేరకపోవడమే ఇందుకు కారణమని తెలుపుతున్నారు. బెయిల్ ప్రాసెస్ ఇంకా పూర్తి కాలేదని పేర్కొంటున్నారు. దీంతో ఇవాళ మొత్తం ఆయన చంచల్గూడ జైల్లోనే ఉండనున్నట్లు తెలుస్తోంది.