
ఆర్సీబీ లక్ష్యం 175 పరుగులు
ఐపీఎల్ 2025 భాగంగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో కేకేఆర్ ఇన్నింగ్స్ ముగిసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 174 పరుగులు చేసింది. KKR బ్యాటర్లలో అజింక్య రహానే (56) అర్థశతకంతో రాణించగా.. ఓపెనర్ సునీల్ నరైన్ 44, రఘువంశీ 30 పరుగులు చేశారు. ఆర్సీబీ బౌలర్లలో కృనాల్ పాండ్య 3, హేజిల్‌వుడ్ 2 వికెట్లు తీయగా సుయాష్,రసిఖ్, దయాల్ తలా ఒక వికెట్ తీశారు.