నాగర్ కర్నూల్ జిల్లాలోని SLBC టన్నెల్ కూలి సరిగ్గా నేటికి నెల రోజులు అవుతుంది. సొరంగంలో బోర్ టన్నెల్ మిషన్‌ను ఆన్ చేయడంతో భూకంపం వచ్చినట్లుగా టన్నెల్ మొత్తం ఒక్కసారిగా ఊగిపోయింది. పై నుంచి మట్టి.. బరద ముంచెత్తడంతో లోపల ఉన్నవాళ్లంతా ఎంతో కష్టంతో బయటకు పరుగులు తీశారు. అధికారులు శాయశక్తులా శ్రమించి ఒకటి మృతదేహాన్ని వెలికి తీశారు. ఇంకా ఏడుగురి మృతదేహాల కోసం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.