భద్రాద్రి రామయ్య బ్రహ్మోత్సవాలు.. మంత్రులకు ఆహ్వానం

79చూసినవారు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనాల్సిందిగా మంత్రులకు ఆహ్వానం అందింది. అపురూపమైన వేడుక శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తంకుమార్ రెడ్డి, జూపల్లి, కృష్ణారావులకు దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, భద్రాచలం ఈవో రమాదేవి ఆహ్వానం అందించారు. ఆలయ పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు సమర్పించారు.

సంబంధిత పోస్ట్