

వైసీపీ బిగ్ షాక్.. జనసేనలోకి భారీ చేరికలు (వీడియో)
AP: ఒంగోలులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఒంగోలు కార్పొరేషన్లో 20 మంది వైసీపీ కార్పొరేటర్లతోపాటు ఇద్దరు కో ఆప్షన్ సభ్యులు జనసేనలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో వీరంతా జనసేన పార్టీలో చేరారు. ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్లో మొత్తం 50 డివిజన్లు ఉన్నాయి. YCP నుంచి 41 మంది గెలవగా ప్రస్తుతం ఆ పార్టీలో నలుగురు కార్పొరేటర్లు మాత్రమే మిగిలారు.