జైపూర్‌కు చెందిన బాక్సింగ్ ఛాంపియన్ మోహిత్ శర్మ (21) బాక్సింగ్ రింగులో గుండెపోటుతో మృతి చెందాడు. మొహాలీలోని చండీగఢ్ విశ్వవిద్యాలయంలో జరుగుతన్న బాక్సింగ్ మ్యాచ్ మధ్యలో హార్ట్ స్ట్రోక్ రావడంతో మోహిత్ ఒక్కసారిగా కుప్పకూలాడు. అక్కడి మెడికల్ టీమ్ వెంటనే స్పందించి తక్షణ వైద్య సహాయం అందించినప్పటికీ ప్రయోజనం లేకుండాపోయింది. హుటాహుటిన అతడిని సమీప ఆసుపత్రికి తరలించగా మోహిత్ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.