ప్రముఖ నటుడు విక్కీ కౌషల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'ఛావా' సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపిస్తోంది. భారత్‌లో ఇప్పటివరకూ ఈ చిత్రం రూ.353 కోట్లు (నెట్) వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ అద్భుత విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా శంభాజీ మహారాజ్‌గా విక్కీ నటనను అందరూ మెచ్చుకుంటున్నారు. ఛావా త్వరలోనే రూ.500 కోట్ల క్లబ్‌లో చేరనుంది.