జస్ట్ 1.8 శాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు: కేసీఆర్

105798చూసినవారు
జస్ట్ 1.8 శాతం ఓట్ల తేడాతో గట్టెక్కారు: కేసీఆర్
పూటకో పబ్లిక్ స్టంట్ తో కాంగ్రెస్ కాలం గడుపుతోందని BRS చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. అధికారంలోకి వచ్చి నాలుగో నెల గడుస్తున్నా.. రుణమాఫీపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మండిపడ్డారు. 'డిసెంబర్ 9 ఎప్పుడు పోయింది. సీఎం రేవంత్ ఎక్కడ పడుకున్నారు. జనాలకు ఇష్టమొచ్చిన సొల్లు పురాణాలు చెప్పి, జస్ట్ 1.8శాతం ఓట్ల తేడాతో గట్టెక్కి రాష్ట్రంలో అధికారంలోకి వచ్చారు. మిమ్మల్ని నిద్రపోనివ్వం. తరిమి కొడతాం' అని హెచ్చరించారు.