నేటి నుంచి ఏపీలో పలు ప్రధాన రైళ్లు రద్దు

82చూసినవారు
నేటి నుంచి ఏపీలో పలు ప్రధాన రైళ్లు రద్దు
దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని నిడదవోలు-కడియం మధ్య ఆధునీకరణ పనుల కారణంగా ఈ నెల 23 నుంచి ఆగస్టు 11 వరకు పలు ప్రధానమైన రైళ్లను అధికారులు రద్దు చేశారు. గుంటూరు-విశాఖ సింహాద్రి, విశాఖ-లింగంపల్లి జన్మభూమి, విజయవాడ-విశాఖ రత్నాచల్, గుంటూరు-విశాఖ ఉదయ్, విశాఖ-తిరుపతి డబుల్ డెక్కర్, గుంటూరు-రాయగడ, విశాఖ-మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్ రైళ్లు, రాజమండ్రి-విశాఖ ప్యాసింజర్‌ను ఇరువైపులా రద్దు చేశారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలన్నారు.

సంబంధిత పోస్ట్