లైంగిక వేధింపుల కేసులో కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కస్టడీ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. ఆయనను 5 రోజుల కస్టడీకి ఇవ్వాలని నార్సింగి పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోక్సో కేసు కావడంతో రంగారెడ్డి జిల్లా కోర్టులో కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. కాగా మరోవైపు తనకు బెయిల్ మంజూరు చేయాలని జానీ మాస్టర్ పిటిషన్ దాఖలు చేశారు.