కర్బూజ గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..

57చూసినవారు
కర్బూజ గింజలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలివే..
కర్బూజ గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్‌ కలిగి ఉన్నాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని పెంచుతాయి. రోగనిరోధక శక్తిని పెంచడంలో సాయపడతాయి. వీటిలోని డైటరీ ఫైబర్ మలబద్ధకాన్ని అరికట్టుతుంది. ఈ గింజల్లో విటమిన్ ఎ, సి, ఇ పుష్కలంగా ఉన్నాయి. మీ చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీనిలోని మెగ్నీషియం, కాల్షియం, ఫాస్పరస్ కంటెంట్ ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సాయపడుతుంది. ఎముక సంబంధిత వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించడంలో సాయపడతాయి.

ట్యాగ్స్ :