హీరో మోటోకార్ప్‌ వాహన ధరలు పెంపు

52చూసినవారు
హీరో మోటోకార్ప్‌ వాహన ధరలు పెంపు
జూలై 1, 2024 నుంచి అన్ని వాహనాల ధరలను రూ.1500 వరకు పెంచనున్నట్లు హీరో మోటోకార్ప్ తెలిపింది. మోడల్, వేరియంట్‌‌ను బట్టి ధరలో మార్పు ఉంటుందని కంపెనీ పేర్కొంది. బడ్జెట్‌స్థాయి బైక్‌లతో పాటు, స్పోర్ట్స్ సెగ్మెంట్ బైక్‌లను కంపెనీ పోర్ట్‌ఫోలియోలో అందిస్తున్నారు. ఇన్‌పుట్ ఖర్చులు పెరుగుతున్నందున.. వినియోగదారులపై భారం మోపేందుకు కంపెనీ సిద్ధమవుతోంది. కానీ పెరిగే ధరలతో కొత్తగా బైక్ కొనేవాళ్లు ఆందోళన చెందుతున్నారు.