ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ హీరో మోటో కార్ప్ తన Hero Xtreme 250R మోటారుసైకిల్‌ను భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో-2025లో ఆవిష్కరించింది. ఈ మోటారు సైకిల్ ధర రూ.1.80లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుంది. ఫిబ్రవరి నుంచి బుకింగ్స్ అధికారికంగా ప్రారంభం అవుతాయని హీరో మోటో కార్ప్ తన సోషల్ మీడియా వేదికలపై పోస్ట్ చేసింది. Hero Xtreme 250R మోటారు సైకిళ్లు మూడు రంగుల్లో లభిస్తాయి.