అసోంలోని గువాహటి రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ తన బిడ్డకు జన్మినిచ్చింది. బిహార్‌కు చెందిన రాణి అనే మహిళ కమలపతి ఎక్స్‌ప్రెస్‌లో అగర్తల నుంచి బరౌనీకి (బిహార్‌లోని బెగుసరాయ్ జిల్లా) ప్రయాణిస్తుండగా ఆమెకు అకస్మాత్తుగా పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో అప్రమత్తమైన రైల్వే పోలీసులు ఆమెను వెంటనే గువాహటి రైల్వే స్టేషన్‌లో దింపారు. అక్కడ మహిళా సిబ్బంది, రైల్వే వైద్యులు ఆమెకు ప్రసవం చేశారు. ప్రస్తుతం తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారు.