దేశంలో ప్రతి 10 నిమిషాలకు ఎక్కడో ఒక చోట మహిళలు అత్యాచారాలు, లైంగిక దాడులకు గురవుతున్నారు. మద్యం, డ్రగ్స్‌కి బానిసైన వారు అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఎన్ని చట్టాలున్నా వారిపై చర్యలు నామమాత్రమే. ఘటన జరిగిన తర్వాత వారిని శిక్షించడం కంటే.. ఘటన జరగకుండా చూడాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వాలపై ఉంది. టీవీల్లో, సినిమాల్లో మహిళలను ఆట వస్తువుగా చూపకుండా ఉంటే ఇటువంటి నేరాలు కొంతమేర తగ్గుముకం పట్టే అవకాశం ఉంటుంది.