మలయాళ స్టార్ మోహన్‌లాల్ లవ్ స్టోరి గురించి ఆయన భార్య సుచిత్ర తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. "నేను మోహన్‌లాల్‌ను మొదటిసారి తిరువనంతపురంలో ఓ పెళ్లిలో చూశాను. అప్పటి నుంచి ఆయనను ప్రేమించడం మొదలుపెట్టా. నా పేరు కూడా రాయకుండా రోజుకు 5 ఉత్తరాలు రాసి ప్రేమతో వేధించాను. ఆయన్ని ముద్దుగా 'సుందర కుట్టప్పన్(అందమైన అబ్బాయి)' అని కోడ్ భాషలో పిలిచేదాన్ని" అని చెప్పుకొచ్చారు.