ఆరోగ్యమే మహాభాగ్యం. కూరగాయలు మన ఆహారంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటి ద్వారా చాలా రకాల పోషక పదార్ధాలు లభిస్తాయి. అయితే ఇంటి పక్కన డాబాపైన సేంద్రీయ పద్ధతిలో ఎలాంటి రసాయన ఎరువులు, సస్యరక్షణ మందులు, కలుపునాశినులు వాడకుండా కూరగాయలు, ఆకుకూరలు, పండ్లు, పూల పంటలను పెంచుకుంటే విషతుల్యం కాని తాజా ఆహారాన్ని కొంతవరకు పొందవచ్చు. మొక్కల పెంపకం ఆరోగ్యకరమైన అలవాటు. మనస్సుకు ఆనందాన్ని, ఆహ్లాదాన్ని కలిగిస్తుంది.