ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో ఇటీవల జరిగిన మహాకుంభ్‌లో బోట్‌మ్యాన్ పింటూ మహ్రా కుటుంబం 45 రోజుల పాటు సుమారు 130 బోట్లు నడిపారు. కుంభమేళా సమయంలో ఆ ఫ్యామిలీ 45 రోజుల్లో 30 కోట్లు ఆర్జించింది. అయితే ఆ కుటుంబానికి ఆదాయపన్ను శాఖ ఇప్పుడు నోటీసులు జారీ చేసింది. ఇన్‌కం ట్యాక్స్ చట్టం 1961 ప్రకారం రూ.12.8 కోట్లు పన్ను చెల్లించాలని ఆ నోటీసులో పేర్కొన్నారు.