సంక్రాంతి సందర్భంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ గాలిపటాలు ఎగురవేయడానికి ఆసక్తి చూపుతారు. కొందరు డాబాపైకి, మరికొందరు ఇంటి కప్పుపైకి వెళతారు. అయితే, ఓ యువకుడు రోడ్డుపై గాలిపటం ఎగురవేస్తూ భారీ ట్రాఫిక్‌కి కారణమయ్యాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణెలో చోటుచేసుకుంది. ఓ యువకుడు గాలిపటం కోసం రోడ్డు మీద ఆగి ఉన్న లారీ ఎక్కాడు. దీంతో వెనుక కిలోమీటర్ మేర ట్రాఫిక్ ఆగిపోయంది.