తమిళనాడు చెంగల్పట్టులో గురువారం దారుణ హత్య వెలుగుచూసింది. కోర్టు కాంప్లెక్స్ వద్ద హత్య కేసు నిందితుడు లోకేష్ ను దుండగులు, తొలుత నాటు బాంబు విసిరి ఆపై కొడవళ్లతో నరికారు. దీంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కోర్టు విధుల్లోని సిబ్బంది అక్కడికి వచ్చేలోపే దుండగులు పరారయ్యారు. ఈ హత్యకు పాతకక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. సీసీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.