తిరుమల ప్రకృతి అందాలు (వీడియో)

57చూసినవారు
ఏపీలో జోరుగా కురుస్తున్న వర్షాలతో తిరుమల గిరులు ప్రకృతి అందాలను సంతరించుకున్నాయి. శేషాచలం కొండలు మంచు తెరలు కప్పుకొని కనువిందు చేస్తున్నాయి. పచ్చదనం మరింత విచ్చుకుని ప్రకృతి ప్రేమికులను కట్టిపడేస్తుంది. ఘాట్ రోడ్లపై ప్రయాణించే భక్తులు వాహనాలు ఆపి ప్రకృతి అందాన్ని ఆస్వాదిస్తున్నారు. కొండపైన జలపాతం వద్ద నీటి ఉధృతి అధికంగా ఉండటంతో టీటీడీ సిబ్బంది భక్తులను అనుమతించడం లేదు.

సంబంధిత పోస్ట్