ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో హైదరాబాద్‌ అగ్రగామి: సీఎం రేవంత్

80చూసినవారు
ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో హైదరాబాద్‌ అగ్రగామి: సీఎం రేవంత్
హైదరాబాద్ లో 21వ బయో ఆసియా-2024 సదస్సు మంగళవారం ప్రారంభమైంది. సీఎం రేవంత్‌ రెడ్డి, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సదస్సులో పాల్గొన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. 'హైదరాబాద్‌ ఐటీ, సాఫ్ట్‌వేర్‌ రంగాల్లో అగ్రగామిగా ఉంది. లైఫ్‌సైన్సెస్‌ రాజధాని మన నగరం అని అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రపంచంలో మూడు కొవిడ్‌ వ్యాక్సిన్‌లు వస్తే.. వాటిలో ఒక వ్యాక్సిన్‌ను అందించిన ఘనత హైదరాబాద్‌కు దక్కింది' అన్నారు.