ఇంటిని మార్కింగ్ చేయడానికి వచ్చిన అధికారులతో వాదనకు దిగిన మూసీ బాధితులు (వీడియో)
మూసీ సుందరీకరణలో భాగంగా నది పరీవాహక ప్రాంతాల్లో అధికారులు శుక్రవారం రెండో రోజు సర్వే నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మూసీ పరివాహక ప్రాంత బాధితులు ఓ ఇంటిని మార్కింగ్ చేయడానికి వచ్చిన రెవిన్యూ అధికారులతో వాదనకు దిగారు. మేము రిజిస్ట్రేషన్ గురించి రిజిస్టర్ ఆఫీసుకి వెళ్ళినప్పుడు.. వాళ్లు ఎందుకు రిజిస్ట్రేషన్ చేశారు. వాళ్లకు తెలియదా ఇది మూసి నదిలోని ల్యాండ్ అని అంటూ అధికారులను ప్రశ్నించారు.