

కూకట్ పల్లి: బీజేపీలో చేరిన కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు
కేంద్రంలో బీజేపీ చేస్తున్న అభివృద్ది కార్యక్రమాలకు ఆకర్షితులై పార్టీలోకి చేరికలు పెరిగాయని మల్కాజ్ గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. బుధవారం మూసపేట్ డివిజన్ కార్పొరేటర్ కోడిచెర్ల మహేందర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు. కార్యకర్తలకు పార్టీ కండువా కప్పి ఈటెల రాజేందర్ పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు ఎర్ర స్వామి తదితరులు పాల్గొన్నారు.