సహాయక చర్యలను పరిశీలించిన జోనల్ కమిషనర్
కూకట్ పల్లి జోన్ పరిధిలో నిన్న రాత్రి కురిసిన వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో జోనల్ కమిషనర్ అభిలాష అభినవ్ సంబంధిత అధికారులతో కలిసి బుధవారం పర్యటించారు. మూసపెట్ మెట్రో స్టేషన్, దిన్ దయాళ్ నగర్ తో పాటు పలు కాలనీలలో పర్యటించి జరుగుతున్న సహాయక చర్యలపై అరా తీశారు. జోనల్ పరిధిలో వర్షల కారణంగా ఎటువంటి ఇబ్బందులు ఉన్న 040-21111111, 9000113667 నంబర్లకు కాల్ చేయాలని సూచించారు.