శ్రీతేజ్ హెల్త్ బులెటిన్ విడుదల
HYDలోని సంధ్య థియేటర్ తొక్కిసలాటలో గాయపడ్డ శ్రీతేజ్ హెల్త్ బులెటిన్‌ను కిమ్స్ ఆస్పత్రి వైద్యులు విడుదల చేశారు. ప్రస్తుతం శ్రీతేజ్ వెంటిలేటర్ సాయం లేకుండానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడని, అప్పుడప్పుడు కళ్లు తెరుస్తున్నాడని తెలిపారు. సైగలను గమనిస్తున్నాడని, మాటలను అర్థం చేసుకోలేకపోతున్నట్లు వెల్లడించారు. ట్యూబ్ ద్వారా శ్రీతేజ్ ఫుడ్ తీసుకుంటున్నాడని పేర్కొన్నారు. కాగా, తొక్కిసలాట ఘటనలో బాలుడి తల్లి రేవతి మృతి చెందిన విషయం తెలిసిందే.