హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట కేసుపై పోలీసుల విచారణ ముమ్మరం చేస్తున్నారు. ఈ కేసులో నిందితులుగా A1 నుంచి A8 వరకు సంధ్య థియేటర్ యాజమాన్యం, మేనేజర్‌ను చేర్చారు. A9, A10 సంధ్య థియేటర్ సెక్యూరిటీ సిబ్బంది, ఫ్లోర్ ఇన్‌చార్జ్‌లను చేర్చారు. A12 నుంచి A17వరకు అల్లు అర్జున్ బౌన్సర్లు, A18గా మైత్రి మూవీమేకర్స్‌ను పోలీసులు చేర్చారు. కాగా, ఇప్పటికే A11గా అల్లు అర్జున్‌ను పోలీసులు చేర్చిన విషయం తెలిసిందే.