అల్లు అర్జున్‌కు బెయిల్.. షరతులివే!
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షరుతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. అల్లు అర్జున్ ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు కావాల్సి ఉంటుందని ఆయన తరపు న్యాయవాది అశోక్ రెడ్డి తెలిపారు. పోలీస్ విచారణకు పూర్తిగా సహకరించాలని కోర్టు సూచించినట్లు వెల్లడించారు. అల్లు అర్జున్ క్వాష్ పిటిషన్‌పై ఈ నెల 21న హైకోర్టులో విచారణ జరగనుందని తెలిపారు.