TG: ఫార్ములా ఈ-రేస్ వ్యవహారంలో ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోంది. ఈ వ్యవహారంలో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఏసీబీ నోటీసులు జారీచేసింది. ఈ నెల 6న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొంది. కేటీఆర్‌తో పాటు బీఎల్‌ఎన్ రెడ్డి, అర్వింద్ కుమార్‌లకు కూడా నోటీసులు జారీ చేశారు.