రైల్వే శాఖలోని పలు విభాగాల్లో దాదాపు 32 వేల లెవెల్-1 (గ్రూప్-డి) ఉద్యోగాల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ ఉద్యోగాల భర్తీకి అవసరమైన కనీస విద్యార్హత ప్రమాణాలను రైల్వే శాఖ తాజాగా సడలించింది. కొత్త ప్రమాణాల ప్రకారం.. పదో తరగతి లేదా ఐటీఐ డిప్లొమా లేదా నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ జారీ చేసిన నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికెట్ కలిగిన ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేసింది.