AP: టీడీపీ నేత జేసీ ప్రభాకర్ చేసిన అసభ్యకర వ్యాఖ్యలపై నటి, బీజేపీ నేత మాధవీలత స్పందించారు. 'ఆ వయసైపోయిన మనిషి మాట్లాడిన గొప్ప బాషకు ధన్యవాదాలు. జేసీ గారికి సమర్థిస్తున్న సైకో ఫ్యాన్స్‌కు కూడా ధన్యవాదాలు. నేను అయితే భయపడటం లేదు. కిడ్నాప్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మర్డర్ చేయాలనుకుంటే చేసుకోవచ్చు. మహిళల మాన, ప్రాణాల విషయంలో వెనక్కి తగ్గను' అని మాధవీ లత వీడియో విడుదల చేశారు.