కాసేపట్లో అల్లు అర్జున్ ప్రెస్‌మీట్
సంధ్య థియేటర్ వివాదం నేపథ్యంలో అల్లు అర్జున్‌పై తాజాగా సీఎం రేవంత్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో నేడు రాత్రి 7 గంటలకు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడంపై ఆసక్తి నెలకొంది. జూబ్లీహిల్స్‌లోని నివాసం నుంచి అల్లు అర్జున్ మాట్లాడనున్నారు. అల్లు అర్జున్ ఏం ప్రకటన చేయనున్నారోనని చర్చ జరుగుతోంది.