కాంట్రవర్సీ దర్శకుడు రామ్‌గోపాల్ వర్మకు ఏపీ ఫైబర్‌నెట్ కార్పొరేషన్ నోటీసు జారీ చేసింది. ఆర్జీవీ తెరకెక్కించిన వ్యూహం సినిమాకు వ్యూస్ లేకున్నా రూ.1.15 కోట్లు అనుచిత లబ్ధి పొందినట్టు ఫైబర్‌గ్రిడ్ ఛైర్మన్ జీవీ రెడ్డి తెలిపారు. ఈ సినిమాకి వ్యూస్ ప్రకారం డబ్బు చెల్లించేలా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారని, అయితే 1,863 వ్యూస్ మాత్రమే ఉన్నాయని, ఈ లెక్కన ఒక వ్యూకు రూ.11 వేల చొప్పున చెల్లించారని తెలిపారు.