'పుష్ప-2' బెనిఫిట్ షో జరిగిన సమయంలో HYD- సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాటలో మృతి చెందిన మహిళ రేవతి కొడుకు శ్రీతేజ హెల్త్ బులిటెన్ ను కిమ్స్ ఆసుపత్రి విడుదల చేసింది. శ్రీతేజ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఇన్ని రోజులు కోమాలో ఉన్న శ్రీతేజ ప్రస్తుతం.. ఆక్సిజన్ అవసరం లేకుండానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. ఆహారాన్ని కూడా తీసుకోగలుగుతున్నాడు. శ్రీతేజకు అప్పుడప్పుడు జ్వరం వస్తోంది. కానీ అతని నాడీ వ్యవస్థ స్థిరంగా పనిచేస్తోంది' అని పేర్కొన్నారు.