తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ పై MIM ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఫైర్ అయ్యారు. 'ఆరోజు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట జరిగిందని పక్కనున్న వాళ్లు ఆయనకు చెప్తే "అయితే మన సినిమా హిట్ అయినట్టే" అని ఆయన వారితో అన్నారు. చనిపోయిన మహిళను కూడా చూడకుండా థియేటర్ నుంచి వెళ్తూ మరోసారి ఫ్యాన్స్ కు చేతులు ఊపారు' అని మండిపడ్డారు. దీనిపై అసెంబ్లీలో సీఎం ప్రకటన చేయాలని ఆయన కోరగా సీఎం ప్రకటన చేశారు.