

బుల్డోజర్ కాన్వాయ్‌తో పెళ్లి ఊరేగింపు (వీడియో)
ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీలో ఓ పెళ్లి ఊరేగింపు ప్రజల దృష్టిని ఆకర్షించింది. వధువు కుటుంబం పెళ్లి ఊరేగింపులో కార్లకు బదులుగా బుల్డోజర్ కాన్వాయ్‌ను ఏర్పాటు చేసింది. వధువు కరీష్మా, వరుడు రాహుల్ యాదవ్ కారులో ఉండగా.. బుల్డోజర్ కాన్వాయ్ కారును అనుసరించింది. తమ కుమార్తె పెళ్లి ఊరేగింపులో వినూత్నంగా ఏదైనా చేయాలని అనుకున్నామని వధువు తండ్రి రామ్ కుమార్ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతోంది.