మిల్కీ బ్యూటీ తమన్నా ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ఓదెల-2 టీజర్‌ను మేకర్స్ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో విడుదల చేశారు. 2021లో విడుదలైన 'ఓదెల రైల్వే స్టేషన్' సినిమాకు సీక్వెల్‌గా ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు సంపత్ నంది కథను అందిస్తుండగా.. అశోక్ తేజ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో తమన్నా ఒక నాగ సాధువు పాత్రలో కనిపించనుంది.