మహా కుంభమేళాలో మిల్క్ బ్యూటీ తమన్నా సందడి చేశారు. 'ఓదెల-2' మూవీ టీజర్ లాంఛ్ నేపథ్యంలో ఆమెతో పాటు దర్శకుడు సంపత్ నంది, యాంకర్ సుమ ఇతర నటీనటులు ఉన్నారు. కాగా కుంభమేళాలో టీజర్ రిలీజ్ చేసిన తొలి చిత్రంగా ఈ మూవీ నిలిచింది. కాగా కరోనా టైమ్‌లో వచ్చిన 'ఓదెల రైల్వేస్టేషన్' మూవీ ఆకట్టుకున్న విషయం తెలిసిందే.