మతిస్థిమితం లేని మహిళపై సామూహిక అత్యాచారం(వీడియో)
మెదక్ జిల్లా ముసాయి పేట మండలం రామంతాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. మతిస్థిమితం లేని ఓ మహిళపై అంబేద్కర్ విగ్రహం వెనుక గద్దెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. తప్పిపోయిన వేరొక మహిళ కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా.. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో ఘటనకు పాల్పడిన ముగ్గరిని పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. మహిళ వివరాలు చెప్పలేకపోవడంతో భరోసా సెంటర్‌కు తరలించారు.