నటుడు విశాల్ తన ఆరోగ్యంపై వచ్చిన వార్తలకు స్పందించారు. శనివారం 'మద గజ రాజ' ప్రీమియరుకు హాజరైన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘మా నాన్న వల్లే నేనెంతో ధైర్యంగా ఉన్నా. జీవితంలో ఎలాంటి కష్టాలు వచ్చినా తట్టుకుని నిలబడుతున్నా. ప్రస్తుతం నాకు ఎలాంటి సమస్యల్లేవు. ఇప్పుడు నా చేతులు వణకడం లేదు. మైక్ కూడా కరెక్ట్‌గా పట్టుకోగలుగుతున్నా. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు. నా తుది శ్వాస వరకూ మీ అభిమానాన్ని మర్చిపోను’ అని విశాల్ తెలిపారు.