పవన్ కోసం కుర్చీ తీసుకురమ్మని ఆదేశించిన అమిత్ షా.. వీడియో వైరల్
AP: విజయవాడ కొండపావులూరులో నిర్వహించిన ఎన్డీఆర్ఎఫ్ 20వ వ్యవస్థాపక వేడుకల్లో ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం శిలాఫలకం టెంట్ దగ్గర కేంద్ర హోం మంత్రి అమిత్ షా, సీఎం చంద్రబాబుకు మాత్రమే కుర్చీలు వేశారు. అది గమనించిన అమిత్ షా.. మరొక కూర్చీ తీసుకురావాలని ఆదేశించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను తన పక్కన కూర్చీలో కూర్చోమని చెప్పారు. ప్రధాని మోదీ, అమిత్ షాలు పవన్‌కు ఇచ్చే ప్రాముఖ్యత ఇదేనంటూ ఈ వీడియోను జనసేన కార్యకర్తలు వైరల్ చేస్తున్నారు.