ఏపీలోని విశాఖ నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా కలకలం రేపింది. ఈ ముఠా సభ్యులు గత కొన్నేళ్లుగా గుట్టుచప్పుడు కాకుండా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తూ.. ఏకంగా రూ.176 కోట్లు కొల్లగొట్టారు. టాస్క్‌ఫోర్స్, సైబర్ క్రైమ్ పోలీసులు చేసిన జాయింట్ ఆపరేషన్ లో మొత్తం 8 మంది క్రికెట్ బుకీలను ఇప్పటివరకు పట్టుకున్నారు. వీరి వద్ద నుంచి రూ.45 లక్షలు ఫ్రీజ్ చేసి, 80 నకిలీ అకౌంట్లు, బ్యాంక్ పాస్ బుక్కులను పోలీసులు గుర్తించారు.