హమాలీ బస్తీలో కూలిన కరెంటు పోల్.. తప్పిన ప్రమాదం

70చూసినవారు
హమాలీ బస్తీలో కూలిన కరెంటు పోల్.. తప్పిన ప్రమాదం
బన్సీలాల్ పేట డివిజన్ హమాలి బస్తీలో పెను ప్రమాదం తప్పింది. గురువారం ఉదయం తీవ్రమైన గాలికి కరెంటు పోల్ విరిగి ఓ ఇంటి మీద పడింది. దీంతో ఇంటి గోడతో పాటు అక్కడే ఉన్న టిఫిన్ సెంటర్ బండి ధ్వంసం అయింది. సమయానికి అక్కడ జనాలు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న జీహెచ్ఎంసీ సిబ్బంది విద్యుత్ శాఖ సిబ్బంది చెట్టును తొలగించి సరఫరా పునరుద్ధరించారు.

సంబంధిత పోస్ట్